లాక్ డౌన్ లో కియరా ఏం చేస్తోంది?

Friday,May 22,2020 - 06:50 by Z_CLU

అందరు హీరోయిన్లలానే కియరా అద్వానీ కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే ఫిక్స్ అయింది. అయితే తనకు బోర్ కొట్టడం లేదంటోంది ఈ బ్యూటీ. ఎప్పట్నుంచో చేయాలనుకున్న ఎన్నో పనుల్ని పూర్తిచేస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకీ ఈ క్వారంటైన్ టైమ్ లో కియరా ఏం చేస్తోందో చూద్దాం.

– కొంతమంది ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు. నాకు మాత్రం బోర్ కొట్టడం లేదు. ఎందుకంటే, ఇంట్లో ఉండడానికే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి. కాకపోతే అంతా చెబుతున్నట్టు నేను కూడా షూటింగ్స్ మిస్ అవుతున్నాను.

– ఈ లాక్ డౌన్ టైమ్ లో కొత్త విషయాలపై దృష్టిపెట్టాను. కొత్త కొత్త వెబ్ సిరీస్ లు చూడ్డంతో పాటు.. ఉర్దూ నేర్చుకుంటున్నాను. ఉర్దూ నేర్చుకోవాలనే కోరిక నాకు ఎప్పట్నుంచో ఉంది. అదిప్పుడు నెరవేరుతోంది,

– నా ఫ్రెండ్స్ తో కలిసి ప్రతి రోజూ ఆన్ లైన్ లో లుడో ఆడుతున్నాను. ఇది చాలా బాగుంది. సరదాగా ఉంది. ఇంటి పనులన్నీ పూర్తయిన తర్వాత కాసేపైనా ఇలా ఫ్రెండ్స్ తో లుడో ఆడడం అలవాటుగా మారిపోయింది.

– ఈ లాక్ డౌన్ టైమ్ లో సినిమాల్ని బాగా మిస్ అవుతున్నాను. థియేటర్లు తెరిచిన వెంటనే అర్జెంట్ గా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళ్లాలి. సీట్లో కూర్చొని పాప్ కార్న్ తినాలి.