#NTR30 - హీరోయిన్ ఫిక్స్?

Saturday,April 17,2021 - 02:02 by Z_CLU

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఎనౌన్స్ అయిన ఈ సినిమాకు కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు కొరటాల. ఓ వైపు ‘ఆచార్య’ కి వర్క్ చేస్తూనే మరో వైపు తారక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కియరా అద్వానీ ని ఫైనల్ చేశారని తెలుస్తుంది. మొన్నటివరకూ తారక్ -త్రివిక్రమ్ సినిమాకు కియరా పేరు చక్కర్లు కొట్టింది. అయితే ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ అవ్వడంతో ఆమెని ఇప్పుడీ సినిమాకు తీసుకోవాలని చూస్తున్నారట.

బాలీవుడ్ బ్యూటీ కియరా తెలుగులో మహేష్ తో ‘భరత్ అనే నేను’ రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలు చేసింది. ఈ సినిమాకి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగులో ఆమెకి ఇది మూడో సినిమా అవుతుంది. త్వరలోనే కియరా కి స్టోరీ వినిపించి ఆమె డేట్స్ లాక్ చేసుకునే పనిలో ఉన్నాడు కొరటాల.

నాలుగు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నుండి ఓ నటుడ్ని విలన్ గా తీసుకోనున్నారని సమాచారం. తారక్ -కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ పవర్ ఫుల్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఎనౌన్స్ మెంట్ నుండే అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు “ఇంతకు ముందు లోకల్ రిపేర్లు చేశాం. కానీ ఈసారి మార్పు కోసం హద్దులు దాటబోతున్నాం” అంటూ కొరటాల పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

kiara-advani-కియరా-అద్వానీ

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics