బన్నీ సరసన మహేష్ బ్యూటీ?

Thursday,November 01,2018 - 02:45 by Z_CLU

త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడీ ప్రాజెక్టులో హీరోయిన్ ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం, కైరా అద్వానీని ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది.

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది కైరా. ప్రస్తుతం ఈ బ్యూటీ, రామ్ చరణ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్టులో కూడా కైరాను తీసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

నిర్మాత అల్లు అరవింద్ తో పాటు బన్నీ ఫ్యామిలీ మొత్తం విదేశీ పర్యటనలో ఉంది. ఫారిన్ వెకేషన్ పూర్తిచేసుకొని, హైదరాబాద్ వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుపై, హీరోయిన్ సెలక్షన్ పై ఓ క్లారిటీ వస్తుంది.