ఇంకో సినిమా చేస్తా – కైరా అద్వానీ

Tuesday,July 17,2018 - 05:41 by Z_CLU

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయింది కైరా అద్వానీ. ఈ బ్లాక్ బస్టర్ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో,  కైరా మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ కి కూడా అదే రేంజ్ లో అప్రీసియేషన్ దక్కింది.

ఫస్ట్ మూవీ రిలీజ్ కూడా అవ్వకముందే కైరా డెడికేషన్ కి  ఇంప్రెస్ అయిన నిర్మాత దానయ్య, బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు.ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా కైరా కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇంకా ఇవ్వలేదని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ చిన్న సైజు డిస్టబెన్స్ క్రియేట్ చేసింది.

అయితే ఈ రూమర్స్ కొట్టిపారేస్తూ D.V.V. ఎంటర్ టైన్ మెంట్స్ తమ ప్రతి కమిట్ మెంట్ కి కట్టుబడి ఉందని, అలాంటి ఇబ్బందులే ఉంటే ఇమ్మీడియట్ గా వారి నెక్స్ట్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చేవాళ్ళే కాదు అని క్లారిటీ ఇచ్చిన కైరా, ఈ బ్యానర్ లో ఇంకో సినిమా చేయడానికైనా రెడీ అని చెప్పుకుంది. ఇదే విషయంలో 2 రోజుల క్రితం నిర్మాత దానయ్య కూడా ఈ రూమర్స్ పై స్పందించిన విషయం తెలిసిందే.