ఖాకి లేటెస్ట్ నైజాం కలెక్షన్లు

Tuesday,November 28,2017 - 01:01 by Z_CLU

కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖాకి. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ సాధించింది. డిఫరెంట్ కాప్ డ్రామాగా అందరి ప్రశంసలు అందుకుంది. అలా విడుదలైన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ సాధించింది తాజాగా విడుదలైన ఈ 11 రోజుల్లో ఖాకి సినిమాకు నైజాంలో కోటి 66 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

కార్తి సినిమాలకు సంబంధించి అతడి కెరీర్ లో నైజాంలో ఇదే హయ్యస్ట్ కలెక్షన్. గతంలో కార్తి నటించిన ఊపిరి సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ అది అతడి సోలో రిలీజ్ కింద రాదు. ఖాకి మాత్రం కార్తి కెరీర్ లో సోలో సినిమాగా విడుదలై నైజాంలో మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరోసారి ప్రచారం ప్రారంభించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకు మరోసారి ప్రమోషన్ ఇస్తోంది.