`ఖైదీ నంబర్ 150` ఫస్ట్‌లుక్ రిలీజ్
Saturday,October 29,2016 - 03:11 by Z_CLU
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రి ఎంట్రీ ఇస్తున్న `ఖైదీ నంబర్ 150`.సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానున్నఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్ పోస్టర్లను నిర్మాత రామ్‌చరణ్ లాంచ్ చేశారు.

వి.వి.వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో చిరు సరసన కాజల్ కథానాయికగా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ సోమవారం నుంచి కొన్ని కీలక సన్నివేశాలతో పాటు . సైమల్టేనియస్‌గా నిర్మాణానంతర పనులు పూర్తి చేసి త్వరలోనే పాటల చిత్రీకరణకు అబ్రాడ్ వెళ్లనున్నారు యూనిట్.