ఖైదీ కూడా అదే రూట్లో..

Sunday,December 18,2016 - 10:00 by Z_CLU

మెగాకాంపౌండ్ లో ఓ సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. ఆ సెంటిమెంట్ తో ఇకపై ఆడియో లకు స్వస్తి పలకబోతున్నారు మెగా హీరోలు. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాతో మొదలైన ఈ ఆనవాయితీ మెగా ఫామిలీకి సెంటిమెంట్ గా మారింది. ‘సరైనోడు’ ఆడియో వేడుక నిర్వహించకుండా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేసిన అల్లు అరవింద్ ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించడంతో లేటెస్ట్ గా ‘ధృవ’ సినిమాకి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. ఈ సినిమా కూడా గ్రాండ్ హిట్ అందుకోవడంతో మరోసారి ఖైదీ విషయంలోనూ ఈ సెంటిమెంట్ నే ఫాలో అవ్వబోతోంది మెగా ఫ్యామిలీ.

    సినిమా పాటలను దశలవారీగా నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేసి జనవరి ఫస్ట్ వీక్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత రామ్ చరణ్. ఇందులో భాగంగా మరికాసేపట్లో ఖైదీ నంబర్-150 ఆడియో సాంగ్ ఒకటి నెట్ లో విడుదలకానుంది. ఈ సెంటిమెంట్ తో ఇప్పటికే మెగా హీరోలు రెండు హిట్స్ సాధించడంతో చిరు కూడా ఈ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 11 న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి  సన్నాహాలు చేస్తున్నారు యూనిట్.