ఖైదీ Vs విజిల్.. దేనిది పైచేయి?

Saturday,October 26,2019 - 12:10 by Z_CLU

తెలుగులో విజయ్ సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. సేమ్ టైం కార్తి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అందుకే విజయ్ నటించిన విజిల్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కార్తి చేసిన ఖైదీ సినిమాకు పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా పైచేయి మాత్రం కార్తిదే.

విజిల్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏకంగా 2 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ వచ్చింది. గతంలో ఇతడు చేసిన అదిరింది సినిమాకు మొదటి రోజు కోటి రూపాయల షేర్ వస్తే, ఈసారి డబుల్ అయింది. అదే టైమ్ లో ఖైదీ సినిమాకు కేవలం 30 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.

కానీ టాక్ పరంగా చూసుకుంటే.. విజిల్ సినిమా ఓన్లీ మాస్ అనిపించుకుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ మాసిజం కనెక్ట్ అవ్వడం కష్టమే. అదే టైమ్ లో ఖైదీ సినిమా కంటెంట్ తో కట్టిపడేసింది. మౌత్ టాక్ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఇవాళ్టి నుంచి ఈ సినిమా ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తంగా చూసుకుంటే లాంగ్ రన్ లో విజిల్ మీద ఖైదీదే డామినేషన్ ఉంటుందని ట్రేడ్ చెబుతోంది. మొత్తానికి కార్తి ఎట్టకేలకు తెలుగులో ఓ హిట్ కొట్టాడన్నమాట.