ఖైదీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

Monday,December 19,2016 - 09:06 by Z_CLU

చిరంజీవి నటిస్తున్న ఖైదీ నంబర్-150 సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మెగాభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు కూడా. అయితే ఫ్యాన్స్ మనసు అర్థం చేసుకున్న చిరంజీవి… వెంటనే ప్రీ-రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు. జనవరి 4న సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను అట్టహాసంగా సెలబ్రేట్ చేయబోతున్నారు. దీనికి వేదిక కూడా ఖరారైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ ఆడిటోరియంలో ఖైదీనంబర్-150 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది.
khaidi-no-150-chiranjeevi-kajal-zee-cinemalu-11
అంతకంటే ముందే పాటల్ని… దశలవారీగా నేరుగా మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అమ్మడు..లెట్స్ డు కుమ్ముడు అనే పాటను నెట్ లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. త్వరలోనే మరిన్ని సాంగ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. వినాయక్ డైరక్ట్ చేసిన ఖైదీ నంబర్-150 సినిమాను జనవరి 11న విడుదల చేయాలని అనుకుంటున్నారు.