ఖైదీ ఓవర్ సీస్ రికార్డ్

Wednesday,January 11,2017 - 12:30 by Z_CLU

ఖైదీ నంబర్ 150 రికార్డుల మోత బిగిన్ అయింది. ఇండియాలోనే కాదు అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150, ఓవర్సీస్ లోను ఖైదీ ఫీవర్ ని జనరేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. U.S. లో 225 కన్నా ఎక్కువ థియేటర్లలో రిలీజైన ఖైదీ… తన మేజిక్ ని స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టింది.

తెలుగు సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయి సర్ ప్రైజ్ చేస్తున్న ఖైదీ నం 150, లాస్ ఏంజిల్స్ లో 9, కాలిఫోర్నియాలో 25, సియాటెల్ లో 5, వర్జీనియా 12 లొకేషన్స్ తో పాటు న్యూయార్క్, న్యూజెర్సీల్లో రికార్డు స్థాయి లొకేషన్లలో రిలీజ్ అయిన ఖైదీ మెగా ఫ్యాన్స్ కి మరింత చేరువైంది.  వీటితో పాటు అట్లాంటాలోని అరోరా సినీప్లెక్స్ లో 250 మంది ఒకేసారి చూడగలిగే బిగ్గెస్ట్ లగ్జరీ థియేటర్స్ లోను ఖైదీ స్క్రీనింగ్ అవుతుంది.

ఖైదీ జస్ట్ స్క్రీనింగ్ విషయంలోనే కాదు, ప్రీమియర్ షో కలెక్షన్స్ లోను రికార్డ్స్ బద్దలు కొడుతుంది. జస్ట్ ప్రీమియర్ షోకే 1,133,615 డాలర్లు కలెక్ట్ చేసింది. ఈ స్పీడ్ చూస్తుంటే బాహుబాలి కలెక్ట్ చేసిన 1.36 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసే చాన్సెస్ కూడా ఉన్నాయి అని అభిప్రాయపడుతున్నాయి ట్రేడ్ వర్గాలు.