150వ సినిమాపై రూ.100 కోట్లు బెట్టింగ్..

Wednesday,January 11,2017 - 10:02 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్-150 ‘. కొన్ని గంటల కిందట విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాస్ లో హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. తొలిరోజే చాలా రికార్డులు బద్దలయ్యే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. ఎందుకంటే, ఒక్క హైదరాబాద్ లోనే 3వందల షోలు పడుతున్నాయి. అటు తిరుపతి, విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో కూడా ఖైదీ సినిమాకు తొలిరోజు రికార్డు షోలు పడుతున్నాయి. అందుకే ఇప్పుడీ సినిమా చుట్టూ 100కోట్ల రూపాయల బెట్టింగ్ నడుస్తోంది. ఈ మూవీ కచ్చితంగా అతి తక్కువ రోజుల్లో వందకోట్ల క్లబ్ లో చేరుకుందని, బాలీవుడ్ సినిమాలకు పోటీగా సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు.

 నిజానికి టాాలీవుడ్ కు వందకోట్ల రూపాయల వసూళ్లు కొత్తకాదు. పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’, జక్కన్న తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా ‘జనతా గ్యారేజ్’ వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించాయి. అయితే బాహుబలి మినహా మిగతా సినిమాలన్నీ దాదాపు ఫుల్ రన్ లో మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. కానీ చిరంజీవి మాత్రం తన తాజా చిత్రంతో వారంలోనే వంద కోట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ‘ఖైదీ నంబర్ 150 ‘కి 30కోట్లు వచ్చాయి. మరోవైపు మొదటి రెండు రోజుల వసూళ్లు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోవడం ఖాయం. సో… అన్నీ అనుకున్నట్టు జరిగితే వారం రోజుల్లో వందకోట్లు మెగా స్టార్ కి పెద్ద కష్టమేం కాదు.