ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై పుకార్లు

Monday,January 02,2017 - 11:50 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి రిఎంట్రీ ఇస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండడం తో జనవరి 4 న విజయవాడలో గ్రాండ్ లెవెల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ప్లాన్ చేశారు యూనిట్. ఈ విషయాన్నీ ఇటీవలే చిత్ర నిర్మాత చెర్రీ స్వయంగా ప్రకటించి అభిమానులందరినీ ఈ ఫంక్షన్ కు ఇన్వైట్ చేసాడు. అయితే  ఈ ఫంక్షన్ పోస్ట్ ఫోన్ అయ్యిందనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

ముందుగా డిసెంబర్ ఎండింగ్ లో ఈ ఫంక్షన్ ను ప్లాన్ చేసిన యూనిట్ కొన్ని కారణాల వల్ల ఈ ఫంక్షన్ పోస్ట్ ఫోన్ జనవరి 4న ఫిక్స్ చేశారు. కానీ ప్రెజెంట్ ఆ డేట్ నుంచి జనవరి 7కి ఈ ఫంక్షన్ పోస్ట్ ఫోన్ అయ్యిందని డేట్ తో పాటు వెను కూడా విజయవాడ కు బదులు గుంటూరు కి షిఫ్ట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ఫంక్షన్ కోసం విజయవాడ లో గ్రాండ్ ప్లాన్ వేసిన మెగా ఫామిలీ ఈ వార్త ను ఖండిస్తారో? లేదా త్వరలోనే ఈ పోస్ట్ ఫోన్ విషయాన్నీ అఫీషియల్ గా తెలియజేస్తారో? చూడాలి..