ఐటెం సాంగ్ తో హల్చల్...

Saturday,December 31,2016 - 11:47 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150 ‘ సినిమాను నుంచి నాలుగో సాంగ్ రిలీజ్ అయింది. న్యూ ఇయర్ సందర్బంగా ఈ సినిమా లోని ఎనర్జిటిక్ ఐటెం సాంగ్ ను  సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు యూనిట్.

   ‘రత్తాలు రత్తాలు’ అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో అందరినీ ఆకట్టుకుంటూ హల్చల్ చేస్తుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందించిన ఈ పాట కు గతం లో చిరు తో అదిరిపోయే స్టెప్స్ వేయించి థియేటర్స్ లో హంగామా చేసిన లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు.  చిరు తో ఈ సాంగ్ లో మళ్ళీ అదిరిపోయే స్టెప్స్ వేయించాడట లారెన్స్. ఈ సాంగ్ సినిమాకు స్పెషల్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు యూనిట్..