రికార్డు బ్రేకింగ్ రేస్ లో ఖైదీ

Monday,January 16,2017 - 11:40 by Z_CLU

రిలీజయింది మొదలు బాక్సాఫీస్ ని షేక్ చేసే పనిలోనే ఉంది మెగాస్టార్ ఖైదీ నం 150. USA బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఖైదీ, 2 మిలియన్ డాలర్స్ క్లబ్ కి ఈజీగా క్వాలిఫై అయిపోయింది.

ఓవర్ సీస్ మార్కెట్ లోను చిరు క్రేజ్ కించిత్ కూడా తగ్గలేదు అని ప్రూఫ్ చేస్తున్న ఖైదీ, చూస్తుంటే అటు $ 2.45 మిలియన్ డాలర్లు వసూలు చేసిన అ..ఆ.., $2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన శ్రీమంతుడు రికార్డులు బ్రేక్ చేసే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తమిళ బ్లాక్ బస్టర్ కత్తి సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ‘ఖైదీ నం 150’ అల్టిమేట్ ఎంటర్ టైనర్ గా మ్యాగ్జిమం ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది. రామ్ చరణ్ కరియర్ లోనే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా, చెర్రీ ని మెగా పవర్ ప్రొడ్యూసర్ గా ఎస్టాబ్లిష్ చేసింది.