క్లయిమాక్స్ కు వచ్చిన ఖైదీ

Wednesday,November 02,2016 - 12:30 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ ‘ఖైధీ నంబర్ 150’ ప్రస్తుతం షూటింగ్ మోడ్ లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనుకున్న సమయానికి సినిమాని కంప్లీట్ చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ వరుసగా 6 రోజుల పాటు జరుగుతుంది. దీంతో కొన్ని సన్నివేశాల మినహా షూట్ మొత్తం పూర్తవుతుంది.

ఈ షెడ్యూల్ తరువాత చిరు, కాజల్ పై 2 పాటల్ని చిత్రీకరించనున్నారు. వీటిలో ఒక పాటను ఉక్రెయిన్ లో, మరో సాంగ్ ను ఇటలీలో షూట్ చేయబోతున్నారు. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.