సెన్సార్ పూర్తిచేసుకున్న ఖైదీ నంబర్-150

Thursday,December 29,2016 - 07:13 by Z_CLU

చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమా ఖైదీ నంబర్-150 సెన్సార్ పూర్తిచేసుకుంది. ఓవైపు దశలవారీగా సాంగ్స్ రిలీజ్ చేస్తూనే.. మరోవైపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసింది యూనిట్. సినిమాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన సెన్సార్ అధికారులు మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉందని తెలుస్తోంది. సెన్సార్ పూర్తయింది కాబట్టి.. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రోజున రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడానికి ఇక ఎలాంటి అడ్డంకులు ఉండవు.

c02omvmxaaavlbr

తాజా సమాచారం ప్రకారం.. ఖైదీ నంబర్-150 సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయాలని అనుకుంటున్నారు. జనవరి 4న జరగనున్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం ఇప్పటికే విజయవాడలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరు రీఎంట్రీ మూవీ కావడంతో ఖైదీ నంబర్-150పై భారీ అంచనాలున్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టే… ఈ సినిమా ఓవర్సీస్ లో కళ్లుచెదిరే రేటుకు అమ్ముడుపోయింది.