ఖైదీ నం 150 రిలీజై 50 డేస్
Wednesday,March 01,2017 - 09:08 by Z_CLU
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నం 150 ఎక్స్ పెక్టేషన్స్ ని మించి రీచ్ అయింది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు క్రియేట్ అయిన జెన్యూన్ వైబ్రేషన్స్ రిలీజైన ప్రతి సెంటర్ లోను బాక్సాఫీస్ ని బద్దలు చేసి మరీ మెగా స్టామినాని ప్రూఫ్ చేసింది.
సంక్రాంతి కానుకగా రిలీజైన ఖైదీ నం 150 రిలీజయి ఇవాళ్టికి సరిగ్గా 50 డేస్ కంప్లీట్ అయింది. చిరు కరియర్ లోనే స్పెషల్ గా నిలిచిపోయిన ఈ సినిమా రిలీజ్ ని మెగాస్టార్ ఫ్యాన్స్ ఫీస్ట్ లా సెలెబ్రేట్ చేసుకున్నారు. V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ బ్లాక్ బస్టర్ కత్తికి రీమేక్ గా తెరకెక్కింది.

ఎనిమిదేళ్ళ గ్యాప్ తరవాత కూడా అదే స్టామినాతో ఎంటర్ టైన్ చేసిన చిరు ‘ఖైదీ నం 150’ తరవాత ఆల్ రెడీ తన 151 సినిమా కోసం ఆల్ రెడీ ప్రిపరేషన్స్ బిగిన్ చేసేశాడు. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా జరగాల్సి ఉంది.