ఖైదీ నంబర్-150 ఆడియో రిలీజ్ డీటెయిల్స్

Thursday,December 08,2016 - 02:22 by Z_CLU

తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా ఖైదీ నంబర్-150. పైగా ఇది చిరంజీవికి 150వ సినిమా కూడా కావడంతో మెగా కాంపౌండ్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ను సెలబ్రేట్ చేయాలని కాంపౌండ్ హీరోలంతా ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా ఆడియో ఫంక్షన్ ను కూడాా కనివినీ ఎరుగని రీతిలో చేయాలని ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్, లొకేషన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

khaidi-no-150-2

తాజా సమాచారం ప్రకారం… ఖైదీ నంబర్-150 ఆడియో వేడుకను విజయవాడలో నిర్వహించాలని అనుకుంటున్నారు. క్రిస్మస్ కానుకగాా డిసెంబర్ 25 సాయంత్రం ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారట. ఆడియో పంక్షన్ కు ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించినట్టు సినిమా నిర్మాత రామ్ చరణ్ స్పష్టంచేశాాడు. మరికొన్ని రోజుల్లో ఖైదీ నంబర్-150 ఆడియో రిలీజ్ కు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.