ఇంకాస్త స్పీడ్ పెంచిన ఖైదీ

Thursday,January 05,2017 - 01:27 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ప్రమోషన్ లో స్పీడ్ పెంచింది. మొన్నటివరకు ఆడియో సాంగ్స్ తో సోషల్ మీడియాలో అదరగొట్టిన మెగాస్టార్.. ఈరోజు నుంచి ప్రమోషన్ లెవెల్ పెంచాడు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మేకింగ్ వీడియోస్ తో హల్ చల్ చేయబోతున్నాడు చిరంజీవి. ఈ
మేరకు అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.

సాంగ్స్ తో ఖైదీ నంబర్ 150 సినిమా ఇప్పటికే హల్ చల్ చేసింది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ అయితే ఏకంగా 80 లక్షల వ్యూస్ దాటేసింది. ఇప్పుడు ఏకంగా మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారంటే, సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. మరీ ముఖ్యంగా మేకింగ్ వీడియోస్ లో చిరు స్టెప్పులు ఉంటే కనుక ఇక ఆ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ఈనెల 11న ఖైదీ నంబర్ – 150 సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను గుంటూరు-విజయవాడ మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ గ్రౌండ్స్ లో శనివారం సెలబ్రేట్ చేయబోతున్నారు.