సంక్రాంతి కి మోస్ట్ ఎవైటింగ్ సినిమా?

Tuesday,August 04,2020 - 12:02 by Z_CLU

బాహుబలి సిరీస్ తర్వాత ప్యాన్ ఇండియా మూవీగా అంతటి ఘన విజయం సాధించిన కన్నడ సినిమా ‘KGF’కి ప్రశాంత్ నీల్ సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. యష్ హీరోగా ‘#KGFChapter2’ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టేజిలో ఉంది. మరోవైపు మొదటి భాగంతో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సంజయ్ దత్ ను విలన్ తీసుకున్నారు. బడ్జెట్ విషయంలో కూడా అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నారు.

అయితే అన్ని అనుకున్నట్లు జరిగి కరోనా ఎఫెక్ట్ లేకపోతే దసరాకి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అఫీషియల్ గా డేట్ కూడా అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాలెన్స్ షూట్ చేయడానికి ఫైనల్ అవుట్ పుట్ చేతిలోకి రావడానికి ఇంకా కొన్ని నెలలు పడుతుంది.

అందుకే సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని నిర్ణయించారు. నవంబర్ లేదా డిసెంబర్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి జనవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఆగస్ట్ 15 నుంచి KGFChapter2 ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుంది.