#KGFChapter2 : అధీర వచ్చేశాడు

Wednesday,July 29,2020 - 03:36 by Z_CLU

అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌..
ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’
ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన అంశం.. అధీరా లుక్‌. ఇంత‌కూ అధీర ఎవ‌రు? క‌్రూర‌మైన వ్య‌క్తి. త‌ను అనుకున్నది సాధించే క్ర‌మంలో ఎంత‌టి క్రూర‌త్వానికైనా తెగించే వ్య‌క్తి. అధీరాకు ఏం కావాలి? అంటే .. ‘కె.జి.య‌ఫ్ చాప్టర్2’ చూడాల్సిందేన‌ని అంటున్నారు చిత్ర
యూనిట్‌.

అధీరా పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు. రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’. ఈరోజు చాప్ట‌ర్ 2లోని అధీరా లుక్‌ను విడుద‌ల చేశారు.

తెల్ల‌టి గ‌డ్డం, మెలితిప్పిన మీసాలు, డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, డ్రెసింగ్, ముఖంపై ప‌చ్చ‌బొట్టు, చేతిలో ప‌దునైన పెద్ద క‌త్తి ప‌ట్టుకుని ఏదో సుధీర్ఘ‌మైన ఆలోచ‌న‌లో ఉన్నట్టుంది అధీరా లుక్.

పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజైంది కేజీఎఫ్ ఛాప్టర్-1. వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ విభాగాల్లో ఈ ఏడాది జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’కి సీక్వెల్ గా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2‘ వస్తోంది.