KGF2.. మరికొన్ని గంటల్లో రాకీభాయ్ హంగామా

Saturday,August 20,2022 - 02:17 by Z_CLU

KGF2 World Television Premiere tomorrow in Zee Telugu

రాకీభాయ్ హంగామా మరికొన్ని గంటల్లో మొదలుకాబోతోంది. వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్టయిన KGF Chapter 2 మూవీ రేపు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఈ సినిమా జీ తెలుగులో ప్రసారం అవుతుంది.

ఈ సినిమాకు డిఫరెంట్ అండ్ గ్రాండ్ గా ప్రచారం నిర్వహించింది జీ తెలుగు. ఏకంగా ప్రీమియర్ డేట్-టైమ్ ఎనౌన్స్ చేస్తూ ఏకంగా 100 అడుగుల పోస్టర్ ను హైదరాబాద్ లో ఆవిష్కరించింది. భారీ క్రేన్ సాయంతో ఈ పోస్టర్ ను రివీల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

KGF తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ -ప్రశాంత్ నీల్ కాంబో దానికి మించే కంటెంట్ తో ‘KGF2’ ని అందించి పాన్ వరల్డ్ లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే , అలాగే యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్ళి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. బిగ్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించిన ఈ సినిమాను స్మాల్ స్క్రీన్ పై ఎక్స్ పీరియన్స్ చేయడానికి రెడీ అవ్వండి.