KGF2 Teaser - హీరో యష్ బర్త్ డే గిఫ్ట్

Wednesday,January 06,2021 - 10:02 by Z_CLU

ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ప్యాన్ ఇండియా మూవీస్‌లో ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ ఒక‌టి. క‌న్న‌డ రాక్‌స్టార్ యష్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్యాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న హోంబాలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో యష్ పుట్టినరోజున ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ టీజ‌ర్‌ను 2021, జ‌న‌వ‌రి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్ర‌క‌టించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. లెక్కప్రకారం సంక్రాంతికి విడుదలకావాల్సిన సినిమా ఇది. లాక్ డౌన్ కారణంగా సమ్మర్ కు పోస్ట్ పోన్ అయింది.