రాకీ మళ్లీ వస్తున్నాడు

Tuesday,May 14,2019 - 01:14 by Z_CLU

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం, హిందీ, తెలుగు, త‌మిళంలో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి.

రాకీగా బాక్సాఫీస్ దుమ్ముదులిపిన యశ్.. ఇప్పుడు చాప్టర్-2తో రెడీ అవుతున్నాడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో షూటింగ్ చేస్తున్నారు. త‌ర్వాత మైసూర్ లో షూటింగ్ చేస్తారు. అటుపై రామోజీ ఫిలింసిటీ షెడ్యూల్ ఉంటుంది. చివరిగా కర్నాటక- భళ్లారిలో షెడ్యూల్ తో మేజర్ పార్ట్ షూట్ పూర్త‌వుతుంది. అప్పటికి 80-90 శాతం కంప్లీట్ అవుతుంది.

కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) అని అర్థం. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర పోరాటాల్ని తెర‌పై చూపించనున్నారు.