సక్సెస్ అయిందని సీక్వెల్ చేయడం లేదు..

Wednesday,March 13,2019 - 03:51 by Z_CLU

KGF జస్ట్ ట్రైలర్ రిలీజైన సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో అయితే అసలీ యష్ ఎవరు..? కనీసం ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయని ఈ హీరో సినిమాకి ఇన్ని వైబ్స్ ఏంటని, షాక్ అయ్యారంతా. ట్రైలర్ లో ఉన్న కంటెంట్ అలాంటిది మరీ. ఈ ట్రైలర్ ఏ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసిందో, ఆ అంచనాలకు మించి ఆడియెన్స్ ని అలరించింది.

సాధారణంగా స్టార్ బేస్డ్ ఫ్యాన్స్ ఉంటారు, ఈ సినిమా మాత్రం స్పెషల్ గా KGF ఫ్యాన్స్ అని ఒక స్పెషల్ కేటగిరీ ఫ్యాన్స్ క్రియేట్ అయ్యేంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా KGF 2 ని లాంచ్ చేశారు మేకర్స్.

నిజానికి మేకర్స్ కూడా KGF రిలీజ్ కి ముందే ఈ సీక్వెల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ‘KGF’ ఇచ్చిన సక్సెస్ కాన్ఫిడెన్స్ తో ఫిల్మ్ మేకర్స్ ఈ సీక్వెల్ ని మరింత గ్రాండ్ స్కేల్ పై ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అయి ఉండకపోతే, ఈ ఇంకాస్త టైమ్ తీసుకుని సెట్స్ పైకి వచ్చేదేమో కానీ, రావడం మాత్రం పక్కా.

KGF లో ‘రాకీ’ అనే సాధారణ కుర్రాడు ‘కొలార్ గోల్డ్ ఫీల్డ్స్’ లో గ్యాంగ్ స్టర్ గా ఎలా రేజ్ అయ్యాడు.? అనే పాయింట్ చుట్టూ తిరిగితే, ఈ చాప్టర్ 2 లో మరో స్ట్రాంగ్ ప్రత్యర్థిని ఎదుర్కునే పరిస్థితుల మధ్య రాకీ మరింత బలవంతుడవుతాడా..? సమస్యల్ని మరింత బలంగా ఎలా ఎదురుకుంటాడు అనేదే చాప్టర్ 2 ప్రధాన కథాంశమని తెలుస్తుంది. సినిమాలోని ఓ కీ రోల్ కోసం ఇప్పటికే సంజయ్ దత్ ని అప్రోచ్ అయ్యారు. లాస్ట్ టైమ్ జస్ట్ కంటెంట్ ని నమ్ముకున్న మేకర్స్, ఈ సారి కంటెంట్ కి, స్ట్రాంగ్ స్టార్ సపోర్ట్ ని కూడా తీసుకుంటున్నారు.