KGF Chapter 2.. డేట్ ఫిక్స్

Friday,August 21,2020 - 08:42 by Z_CLU

లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన పెద్ద సినిమాల్లో KGFChapter2 కూడా ఒకటి. భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ లో ఆగిపోయింది. అలా నిలిచిపోయిన ఫైనల్ షెడ్యూల్ ను తిరిగి ప్రారంభించడానికి డేట్ ఫిక్స్ చేశారు.

ఆగస్ట్ 26 నుంచి బెంగళూరులోని కంఠీరవ స్టుడియోస్ లో కేజీఎఫ్ ఛాప్టర్-2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 10 రోజుల పాటు నడిచే ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించి టాకీ మొత్తం పూర్తిచేయబోతున్నారు. నిజానికి ఈ సినిమా షెడ్యూల్ ను ఆగస్ట్ 15 నుంచి అనుకున్నారు. కానీ 26కు పోస్ట్ పోన్ అయింది.

ఈ షెడ్యూల్ తర్వాత క్లైమాక్స్ ఫైట్ మాత్రమే పెండింగ్ ఉంటుంది. 

ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయిందని ప్రకటించిన దర్శకుడు Prashanth Neel.. ఛాప్టర్-2ను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించాడు. రాకీ భాయ్ గా Yash మరోసారి ఈ సినిమాతో తన విశ్వరూపం చూపించబోతున్నాడు.