‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో కీ పాయింట్

Wednesday,September 12,2018 - 07:09 by Z_CLU

రేపు రిలీజ్ అవుతున్న ‘శైలజారెడ్డి సినిమా’ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాగచైతన్య. ఫుల్లీ లోడెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కంప్లీట్ గా కొత్తగా కనిపిస్తానని ఎగ్జైటెడ్ గా ఉన్న చైతు, సినిమాకి మెయిన్ ఎసెట్ స్టోరీలైన్ అని చెప్పుకున్నాడు.    

“మూవీలో ఇగో లేని క్యారెక్టర్ నాది. కానీ నా చుట్టూ ఉన్న పాత్రలన్నీ ఫుల్ ఇగోతో ఉంటాయి. సరిగ్గా అక్కడే కామెడీ పండుతుంది. ఇగో వల్ల సంబంధాలు ఎలా దెబ్బతింటాయి, ఇగో లేకపోతే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందనే విషయాన్ని చూపిస్తున్నాం. నేను కాలేజ్ చదువు పూర్తిచేసి, మా నాన్న కంపెనీలో జాబ్ చేస్తుంటాను. ఓవైపు ఆయన ఇగోను భరిస్తున్న టైమ్ లో ఇగోతో ఉన్న హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ తల్లి ఇగో కూడా యాడ్ అవుతుంది. వీళ్లందర్నీ నేను ఎలా మార్చాననే విషయాన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పాం.” అని సినిమాలోని కీ పాయింట్ ని రివీల్ చేశాడు చైతు.

మారుతి మార్క్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నాగచైతన్యకి అత్తలా కనిపించనుంది. చుట్టూరా ఈగోయిస్టిక్ క్యారెక్టర్స్ మధ్య, కూల్ గా ఉండే కుర్రాడిలా రేపటి నుండి థియేటర్స్ లో మెస్మరైజ్ చేయనున్నాడు నాగచైతన్య. ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్.