మెగాస్టార్ - కొరటాల సినిమాలో కీ ఎలిమెంట్

Tuesday,February 26,2019 - 05:16 by Z_CLU

ఓ వైపు ఇమోషన్… దానికి తోడు కావాల్సినంత యాక్షన్ వాటి మధ్య ఎక్కడా కావాలని పెట్టిన ఫీలింగ్ లేకుండా ఓ కాంటెంపరరీ మెసేజ్… అదీ కొరటాల స్టైల్. అందుకే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న చిరు – కొరటాల కాంబినేషన్ లో రానున్న సినిమాలో ఏ మెసేజ్ ఉంటుందా క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

మిర్చి – ఫస్ట్ సినిమా తోనే తన మార్క్ ని ఎలివేట్ చేశాడు కొరటాల. ‘ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు…’ అని ట్రెండీగా చెప్పి, గొడవలు పెట్టుకోవడం కన్నా, కాస్త కాంప్రమైజ్ అయి కలిసుండటమే బెటర్ అనిపించాడు. మెసేజ్ తో పాటు కొరటాల ఈ సినిమాలో ప్రెజెంట్ చేసిన హిలేరియస్ సీన్స్ తో పాటు, సెంటిమెంట్   సిచ్యువేషన్స్  సరిగ్గా ఎగ్జిక్యూట్  అయ్యాయి.

 

శ్రీమంతుడు – ‘ఊరికి ఎంతో కొత్త ఇచ్చేయాలి లేకపోతే లావైపోతాం’. అని ఉద్యోగాల కోసం సొంతూరు వదిలి ఎక్కడికో వెళుతున్న యూత్ ఒక్కసారిగా తిరిగి సొంతూళ్ళను చూసుకునేలా చేసిందీ సినిమా. కమర్షియల్ వ్యాల్యూస్ ని, మన గ్రామాలను మనమే కాపాడుకోవాలి అనే మెసేజ్ తో బ్లెండ్ చేసి, కొరటాల సినిమాని ప్రెజెంట్ చేసిన తీరు సింప్లీ సూపర్బ్.

జనతా గ్యారేజ్ : సీజనల్ గా ఎవరైనా చెప్తేనే ఏదో అలా మొక్కలు నాటేసి పనైపోయింది అనిపించుకునే వాళ్ళు కూడా మన పర్యావరణం పట్ల మనకున్న బాధ్యత ఏంటో తెలుసుకునేలా చేసిందీ సినిమా. మెసేజ్ ఉన్న 100% NTR సినిమా జనతా గ్యారేజ్.

 

భరత్ అనే నేను : మహేష్ బాబు స్టైల్ లో అటు పాలిటీషియన్స్ కి, ఇటు సిటిజన్స్ కలిపి మెసేజ్ ఇచ్చాడు కొరటాల. దానికి తోడు మహేష్ బాబు స్టైలిష్ లుక్స్, సినిమాని గ్రాండ్ సక్సెస్ చేశాయి. మరీ ముఖ్యంగా సినిమాలో హైలెట్ అయిన  ఎడ్యుకేషన్, హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కామన్ మ్యాన్ కి స్ట్రేట్ గా రీచ్ అయ్యాయి.

అందుకే మెగాస్టార్ తో సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ అంచనాలు. అవన్నీ మైండ్ లో పెట్టుకునే, జస్ట్ కథే కాదు అందులో  మెసేజ్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు కొరటాల. అదేంటనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.