నక్షత్రం సినిమాలో కీ ఎలిమెంట్ అదే...

Tuesday,July 18,2017 - 12:20 by Z_CLU

కృష్ణవంశీ నక్షత్రం ఈ నెల 28 న రిలీజ్ కి రెడీగా ఉంది సందీప్ కిషన్ హీరోగా, సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించారు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో సినీటౌన్ లో ఈ సినిమా చుట్టూ అప్పుడే హడావిడి బిగిన్ అయిపోయింది.

నక్షత్రం సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న కృష్ణవంశీ పోలీసుల చుట్టూ తిరిగే కథాంశంతో… సొసైటీలో టెర్రరిజం, మావోయిజాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆయుధాలను సరఫరా చేసే సంఘ విద్రోహ శక్తులను పోలీస్ యంత్రాంగం ఎలా అణచివేసింది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు. దానికి తోడు కృష్ణవంశీ మార్క్ రొమాన్స్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకి పెద్ద ఎసెట్ కానున్నాయి.

 

బీమ్స్  మ్యూజిక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ట్రేలర్, ఈ సినిమా రిలీజ్ డేట్ ని మర్చిపోయే చాన్స్ లేకుండా ఎట్రాక్ట్ చేసేసింది.