సుమంత్ కొత్త సినిమాలో కీ ఎలిమెంట్
Wednesday,August 08,2018 - 06:57 by Z_CLU
సూపర్ న్యాచురల్ అంశాలతో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతుంది సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’. ‘అనుగ్రహించే దేవుడే ఆగ్రహిస్తే…?’ ఇదే సుమంత్ కొత్త సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలో ఉండబోయే కీ ఎలిమెంట్. ఇది సుమంత్ కరియర్ లో 25 వ సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.
రీసెంట్ సుబ్రహ్మణ్య స్వామి పై ఒక స్పెషల్ సాంగ్ ని తెరకెక్కించిన ఫిలిమ్ మేకర్స్ ఆల్మోస్ట్ 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో హీరో, హీరోయిన్స్ కాంబినేషన్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిలిమ్ మేకర్స్.

సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజర్.