'కేశవ' కి సెన్సార్ క్లియరెన్స్

Monday,May 15,2017 - 03:00 by Z_CLU

నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రివేంజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ‘కేశవ’ రిలీజ్ కి రెడీ అవుతుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ కారక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ బోర్డు నుంచి యు/ఏ సర్టిఫికేట్ అందుకుంది..

నిఖిల్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా ఇషికా కొప్పికర్ ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకొని మే 19 నుంచి థియేటర్స్ లో హంగామా చేయబోతుంది… ఓ వ్యాధితో భాధ పడే యువకుడు తనకు అన్యాయం చేసిన వాళ్ళ పై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రూపొందిన కేశవ ప్రెజెంట్ ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమా పై భారీ అంచనాలు పెంచేస్తుంది..