'కేశవ' 10 రోజుల కలెక్షన్స్

Monday,May 29,2017 - 08:00 by Z_CLU

నిఖిల్‌-సుధీర్ వర్మ కాంబినేషన్ లో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ‘కేశ‌వ’ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రిలీజ్ రోజే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్నఈ సినిమా మెద‌టి మూడురోజులకు 11 కొట్ల 40 ల‌క్ష‌లు వ‌సూలు చేసి, మెద‌టి వారంలోనే 16 కొట్లు గ్రాస్ సాధించింది. ఇక రెండ‌వ వీకెండ్ కి దాదాపు అన్ని ఎరియాల్లో బ్రేక్ ఈవెన్ గా నిల‌వ‌టమే కాకుండా 18 కోట్లు దాటి వసూళ్లు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతూ దూసుకెళ్తుంది.

అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై అభిషేక్‌ నామా నిర్మాత గా రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన రితూవర్మ హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటించింది. ప్రెజెంట్ అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా 10 రోజులకు గాను 18.5 కోట్లు కొల్లగొట్టి నిఖిల్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచింది..