కీర్తీ నెక్స్ట్ తెలుగు సినిమా డీటెయిల్స్

Sunday,December 16,2018 - 11:03 by Z_CLU

‘మహానటి’ సినిమాతో హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ తెలుగులో మరో ప్రాజెక్ట్ సైన్ చేసింది. నరేంద్ర నాథ్ అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన లేడీ ఓరియంటెడ్ స్టోరీ కి ఇటివలే కీర్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని ,వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి రానుందని సమాచారం.

ఈ సినిమాలో కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఆడిషన్ కూడా నిర్విస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కాస్ట్, క్రూ డిటైల్స్ తో అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారు.