ఫస్ట్ లుక్ ఫాంటాస్టిక్ - టీజర్ పైనే ధ్యాసంతా

Saturday,April 14,2018 - 03:01 by Z_CLU

‘మహానటి’ లో కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ రిలీజయింది. రీసెంట్ గా సమంతా లుక్ ఆ తరవాత విజయ్ దేవరకొండ లుక్  ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఈ రోజు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ తో పాటు, సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. దాని ప్రకారం గానే కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.సీనియర్ నటి సావిత్రి రోల్ లోకనిపించనుంది కీర్తి సురేష్ ఈ సినిమాలో. అయితే దర్శకుడు అశ్విన్, కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్ దగ్గరి నుండి, మేకప్ వరకు ప్రతీది పర్ఫెక్ట్ గా సావిత్రి స్టైల్ లోనే డిజైన్ చేశాడనిపిస్తుంది.

ఈ రోజు రిలీజైన ఈ పోస్టర్ ని, బ్లాక్ & వైట్ లో రిలీజ్ చేయడంతో, కీర్తి సురేష్ ని సావిత్రిలా ప్రెజెంట్ చేయడంలో ఆల్మోస్ట్ అశ్విన్ సక్సెస్ అయ్యాడనే అనిపిస్తుంది.
ఇక ఈ రోజు సాయంత్రం కల్లా రిలీజ్ కానున్న టీజర్ పై ఫిక్స్ అయి ఉంది ఫ్యాన్స్ కాన్సంట్రేషన్.

వైజయంతి మూవీస్ ప్రెజెంట్స్ లో స్వప్న సినిమా బ్యానర్ పై మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.