#KeerthySuresh - మహానటి వచ్చేసింది

Monday,September 28,2020 - 10:02 by Z_CLU

ఇప్పటికే సెట్స్ పైకి వచ్చింది #RangDe మూవీ. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ రీసెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడీ మూవీ మరింత ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వబోతోంది. ఎందుకంటే ఈ వారం Keerthy Suresh కూడా సెట్స్ పైకి రాబోతోంది.

అవును.. లాక్ డౌన్ కారణంగా దాదాపు 5 నెలలు ఇంట్లోనే ఉండిపోయిన కీర్తిసురేష్.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఈ వారం ఆమె రంగ్ దే సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

Sithara Entertainments బ్యానర్ పై వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో Nithin-Keerthy Suresh ఫస్ట్ టైమ్ కలిశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. సంక్రాంతికి ఈ సినిమాను రెడీ చేస్తున్నారు.

ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిన వెంటనే మహేష్ హీరోగా రాబోతున్న సర్కారువారి పాట సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తుంది కీర్తిసురేష్.