పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్...

Wednesday,November 16,2016 - 06:54 by Z_CLU

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. చేసిన ఫస్ట్ మూవీతోనే హిట్ హీరోయిన్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే సెట్స్ పైకి రానున్న పవన్-త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కీర్తి సురేష్ ను వరించింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. పవర్ స్టార్ తో నటించే ఛాన్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ప్రకటించింది. డిసెంబర్ మూడో వారం లేదా జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ప్రస్తుతం కీర్తి సురేష్…. తెలుగులో నాని, తమిళ్ లో సూర్యతో సినిమాలు చేస్తోంది.

keerthy-suresh-tweet