మహానటి డబ్బింగ్ బిగిన్ చేసిన కీర్తి సురేష్

Thursday,April 05,2018 - 01:23 by Z_CLU

మే 9 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది మహానటి. అయితే ఈ సినిమాలో సావిత్రమ్మ రోల్ లో కనిపించనున్న కీర్తి సురేష్, నిన్నటి నుండి ఈ సినిమా డబ్బింగ్ చెప్పడం బిగిన్ చేసింది. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

సావిత్రి లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజ్ ని ఎలివేట్  చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఇటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్న కొంతమంది స్టార్స్ లుక్స్ తప్ప, సినిమాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ప్లాన్ చేసుకుంటున్న సినిమా యూనిట్, పక్కా ప్లానింగ్ తో సినిమా ప్రమోషన్స్ బిగిన్ చేసే ఆలోచనలో ఉన్నారు.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతా కీ రోల్ ప్లే చేస్తుంది. జెమినీ గనేషన్ క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు S.V. రంగారావు గా, నాగచైతన్య నాగేశ్వర రావు రోల్స్ లో కనిపించనున్న ఈ సినిమాలో  మరెన్నో సర్ ప్రైజెస్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నాయి. ఈ సినిమాని స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు.