RangDe - నితిన్ నా బెస్ట్ ఫ్రెండ్

Monday,March 22,2021 - 01:17 by Z_CLU

మొదటి సినిమాకే నితిన్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడని చెబుతోంది కీర్తిసురేష్. రంగ్ దే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన ఈ హీరోయిన్.. సినిమాలో నితిన్ తో తన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని, అంతా ఎంజాయ్ చేస్తారని చెబుతోంది.

“ఇది చాలా మంది స్క్రిప్ట్. డైరక్టర్ వెంకీ వచ్చి స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఓకే చెప్పాను. అంత మంచి సినిమా ఇది. దేవిశ్రీతో ఇది నా హ్యాట్రిక్ మూవీ. కచ్చితంగా హ్యాట్రిక్ కొడతాం. వెన్నెల కిషోర్ తో ఇది నా ఫస్ట్ మూవీ. నితిన్ తో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. మేం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సినిమాలో నితిన్ తో నా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.”

ఈనెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది రంగ్ దే. నితిన్ అర్జున్ గా, కీర్తిసురేష్ అనుగా కనిపించబోతున్నారు. సినిమా మొత్తం ఫన్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కలర్ ఫుల్ గా ఉండబోతోంది.