గ్రాండ్ గా కీర్తిసురేష్ కొత్త సినిమా లాంచ్

Thursday,January 10,2019 - 05:48 by Z_CLU

కీర్తి సురేష్ కొత్త సినిమా లాంచ్ అయింది. ‘మహానటి’ తో ఆల్మోస్ట్ అందరికీ పరిచయమే అనిపించుకున్న కీర్తి సురేష్, ఈసారి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో మరింత పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ లో కనిపించనుంది. సినిమా స్టోరీలైన్ లాంటి డీటేల్స్ విషయంలో ప్రస్తుతానికి సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న మేకర్స్, ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ బిగిన్ చేయనున్నారు. 

ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, వైజాగ్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తరవాత మ్యాగ్జిమం షూటింగ్ U.S. లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకోనున్న మేకర్స్, ఈ సినిమా ప్రతి ఇండియన్ ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 

మహేష్ కోనేరు ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు. కళ్యాణ్ కోడూరి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సినిమాలో కీర్తి సురేష్ తో పాటు నటించనున్న తక్కిన నటీనటుల డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.ఈ సినిమాతో నరేంద్ర డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.