బర్త్ డే స్పెషల్.. ఫస్ట్ లుక్ రిలీజ్

Thursday,October 17,2019 - 11:14 by Z_CLU

ఈరోజు కీర్తిసురేష్ బర్త్ డే. టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా ఆమెకు బర్త్ డే విశెష్ చెబుతున్నారు. ఈ సందర్భంగా కీర్తిసురేష్ నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.

వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. తనూ వెడ్స్ మనూ ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. దీపావళికి టైటిల్ రిలీజ్ చేయబోతున్నారు.