కీర్తి సురేష్ కొత్త సినిమా అప్ డేట్స్

Tuesday,February 05,2019 - 12:38 by Z_CLU

కీర్తి సురేష్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ  సినిమా ఫిబ్రవరి 10 నుండి సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న మేకర్స్  హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యుల్ ప్లాన్ చేసుకున్నారు.

హైదరాబాద్ షెడ్యూల్  తరవాత ఇమ్మీడియట్  గా కేరళలో రెండో షెడ్యుల్ ని బిగిన్ చేయనున్న మేకర్స్, సినిమాలోని మ్యాగ్జిమం షెడ్యూల్ ని U.S. లో తెరకెక్కించనున్నారు. ‘మహానటి’ తరవాత కీర్తి సురేష్ నటిస్తున్న సినిమా కావడంతో, ఆడియెన్స్ లో ఈ సినిమా చుట్టూ  భారీ అంచనాలున్నాయి.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాతో నరేంద్ర నాథ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫీమెల్ సెంట్రిక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరు మ్యూజిక్ కంపోజర్.  సమ్మర్ ఎండింగ్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.