Miss India - ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన మహానటి

Saturday,October 24,2020 - 01:47 by Z_CLU

Mahanati తర్వాత కీర్తి సురేష్ తెలుగులో నటిస్తున్న ‘Miss India’ సినిమా ట్రైలర్ విడుదలైంది. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకొని తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది.

సినిమా బ్యాక్ డ్రాప్ తెలియజేసేలా ట్రైలర్ కట్ చేసి కంటెంట్ ఇది అని క్లియర్ కట్ గా చెప్పేసారు మేకర్స్. చిన్నతనం నుండి వ్యాపారం చేయాలనే కోరిక ఉన్న ఒకమ్మాయి పెద్దయ్యాక ఒడిదుడుకులను చేధించి ఎట్టకేలకు వ్యాపారం ప్రారంభించి ఎలా ఎదిగింది అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

అలాగే సినిమాలో హీరోయిన్ చేసే చాయ్ బిజినెస్ ను కూడా రివీల్ చేసేసారు. MBA చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటూ సంయుక్త చిన్నతనంలో చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ చివరిగా “మిస్ ఇండియా అంటే నేను కాదు మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్” అంటూ ఆ సస్పెన్స్ కూడా లేకుండా చెప్పేశారు.

అలాగే ట్రైలర్ లో కీర్తి సురేష్ క్యారెక్టర్ తో పాటు జగపతి బాబు , రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ముందే చెప్పేసారు. ఇక Thaman మ్యూజిక్ , Dani Sanchez-Lopez Vamsi P విజువల్స్ ట్రైలర్ లో హైలైట్స్.