మహానటి టీజర్ – అదరగొట్టిన కీర్తి సురేష్

Saturday,April 14,2018 - 07:49 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ మూవీ మహానటి. సీనియర్ నటి సావిత్రి  లైఫ్ లోని సినిమా కరియర్ తో పాటు ఇమోషనల్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తూ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ టీజర్ ఈ రోజు రిలీజైంది.

టీజర్ చూసిన వెంటనే అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది 0:50 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్. జర్నలిస్ట్ గా పనిచేసే సమంతా టైప్ రైటర్ లో  ‘అనగనగా ఒక మహానటి…’ అంటూ సావిత్రి  గురించి టైప్ చేయడంతో బిగిన్ అయ్యే ఈ టీజర్,  సావిత్రికి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ తో పాటు, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో తన పర్సనల్ లైఫ్ మచ్చుకు ఎలివేట్ చేస్తుంది.

ఈ సినిమా కోసం నాగ అశ్విన్ చేసిన రీసర్చ్ విషయం కాసేపు పక్కన పెడితే సావిత్రిగా కీర్తి సురేష్ అందరి మనసులు గెలుచుకోవడం ఖాయమనిపిస్తుంది. కీర్తి సురేష్ గత సినిమాలతో పోలిస్తే, సావిత్రిలా బాడీ లాంగ్వేజ్ ని ప్రెజెంట్ చేయడంతో పాటు, 80 ల నాటి హావభావాలను అడాప్ట్ చేసుకున్న తీరు సూపర్బ్ అనిపిస్తుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ కూడా అందరి చేత ‘మహానటి’ అనిపించుకోవడం గ్యారంటీ.

మే 9 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి మరింత డిమాండ్ ని క్రియేట్ చేస్తుంది మహానటి టీజర్. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజర్.