సెన్సార్ క్లియర్ చేసుకున్న మహానటి

Saturday,May 05,2018 - 09:32 by Z_CLU

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘మహానటి’ ఈ నెల 9 న గ్రాండ్ గా రిలీజవుతుంది. సీనియర్ నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ క్లియర్ చేసుకుని క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందింది. 1980’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా, రిలీజ్ కి ముందే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

రీసెంట్ గా గ్రాండ్ ఆడియో లాంచ్ జరుపుకుంది సినిమా యూనిట్. సోషల్ మీడియాలో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సినిమా సక్సెస్ గ్యారంటీ అనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సావిత్రి తన సినిమా కరియర్ లో రీచ్ అయిన హైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లోని మరెన్నో విషయాలు ఈ బయోపిక్ లో రివీల్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో సమంతా, విజయ్ దేవరకొండ జంటగా కీ రోల్ ప్లే చేస్తున్నారు.  స్వప్నదత్, ప్రియాంక దత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.