సావిత్రి గెటప్ లో కీర్తిసురేష్

Tuesday,May 30,2017 - 06:20 by Z_CLU

మహానటి సెట్స్ పైకి వచ్చేసింది. నిన్నట్నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి రోజు ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి చిత్రపటాలపై షాట్స్ తీశారు. ఈరోజు నుంచి కీర్తిసురేష్ పై ఓ సాంగ్ తీస్తున్నారు. సినిమాలో సావిత్రి పాత్ర పోషిస్తోంది కీర్తిసురేష్. అప్పటి సావిత్రి మేనరిజమ్స్, ఎక్స్ ప్రెషన్స్ ను అందంగా పలికిస్తోందని టాక్.

కేవలం యాక్టింగ్ లోనే కాకుండా.. నేటివిటీ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దుస్తులు, మేకప్, యాంబియన్స్ లాంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ కూడా సావిత్రి టైమ్ నాటి సంగీతంలా ఉంటుంది. ప్రస్తుతం సావిత్రి గెటప్ లో ఉన్న కీర్తిసురేష్ పై ఓ సాంగ్ తీస్తున్నారు.

వచ్చేనెల 15 నుంచి సెట్స్ పైకి దుల్కర్ సల్మాన్ కూడా వస్తాడు. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ పోషించబోతున్నాడు. 15 నుంచి కీర్తి-దుల్కర్ మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.