సర్కారు వారి పాట ... ఫైనల్ అయినట్టేనా?

Saturday,June 13,2020 - 12:53 by Z_CLU

మహేష్ నెక్స్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడులో జరుగుతుంది. షూటింగ్ కి ఇంకా టైం ఉండటంతో దర్శకుడు పరశురాం, తమన్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీ అయ్యాడు. అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించి స్టార్ట్ కాస్ట్ ఫైనల్ అయింది.

హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకున్నారు మేకర్స్. కానీ ఈ విషయాన్ని ఇంకా బయటికి చెప్పలేదు. త్వరలోనే అఫీషియల్ గా కీర్తి కి వెల్ కం చెప్పాలని భావిస్తున్నారు.

‘మహానటి’ తర్వాత తెలుగులో కీర్తి రెండు సినిమాలు కమిట్ అయింది. అందులో ఒకటి ‘మిస్ ఇండియా’ కాగా మరొకటి నితిన్ తో చేస్తున్న ‘రంగ్ దే’. ఈ రెండు సినిమాలు షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉండటంతో మహేష్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే సూపర్ స్టార్ తో సెట్ లో సందడి చేయనుంది.