మెగాస్టార్ సరసన మహానటి?

Wednesday,April 10,2019 - 02:35 by Z_CLU

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న కొరటాల శివ సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే శృతిహాసన్ పేరు డిస్కషన్ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు కీర్తిసురేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. శృతిహాసన్ తో పాటు కీర్తిసురేష్ కూడా ఉంటుందట. అంటే, ఇద్దరు హీరోయిన్లన్నమాట.

భరత్ అనే నేను సక్సెస్ తర్వాత పూర్తిగా ఈ సినిమాపైనే ఫోకస్ పెట్టిన కొరటాల, రీసెంట్ గా స్క్రీన్ ప్లే పూర్తిచేశాడు. సైరా కంప్లీట్ అయిన తర్వాత నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటారు చిరంజీవి. ఆ వెంటనే కొరటాల డైరక్షన్ లో మూవీ స్టార్ట్ అవుతుంది. కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుంది.