Keerthy Suresh - సఖి జూన్ 3న వస్తోంది
Tuesday,March 02,2021 - 12:03 by Z_CLU
జాతీయ ఉత్తమనటి కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తుండగా, జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
విమన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సహ నిర్మాత శ్రావ్య వర్మ ఆధ్వర్యంలో ఎక్కువ మంది లేడీ టెక్నీషియన్లు పనిచేస్తుండటం గమనార్హం.
నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతోంది.
పాపులర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పిస్తోన్న ‘గుడ్ లక్ సఖి’ని వర్త ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని జూన్ 3న విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఆ పోస్టర్‌లో కీర్తి సురేష్ ఓ గన్ పట్టుకొని చిరునవ్వులు చిందిస్తుండగా, ఆమెకు చెరోవైపు జగపతిబాబు, ఆది పినిశెట్టి నిల్చొని ఉన్నారు.
స్పోర్ట్స్ రొమ్-కామ్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ ఒక షూటర్‌గా కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సమకూరుస్తుండగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.