రెండు సినిమాలతో హల్చల్ .....

Monday,March 13,2017 - 01:02 by Z_CLU

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గరైపోయింది… మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ లేటెస్ట్ గా ‘నేను లోకల్’తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే..

టాలీవుడ్ లో ఇప్పటికే రెండు హిట్స్ అందుకొని లక్కీ గర్ల్ బిరుదు సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రెజెంట్ నెక్స్ట్ సినిమాలతో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో భారీ ఆఫర్ అందుకున్న కీర్తి లేటెస్ట్ గా ‘మహా నటి’ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ అందుకొని మరో సారి హిట్స్ లోనే కాదు ఆఫర్స్ లోనూ లక్కీ అని ప్రూవ్ చేసుకుంది .. ఎప్పటి నుంచో సావిత్రి బయోపిక్ సినిమాకి చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా ఆ ఛాన్స్ కీర్తి అందిపుచ్చుకోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో కీర్తి హాట్ టాపిక్ అవుతుంది.. ఇవే కాకుండా తెలుగులో మరికొన్ని బడా సినిమాల్లో కూడా కీర్తి ని ఫైనల్ చేసేందుకు చూస్తున్నారు మేకర్స్…. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న కీర్తి ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ అయిపోవడం ఖాయం మరి…