'RRR' లో హీరోయిన్ ఫిక్స్ ?

Sunday,January 20,2019 - 12:02 by Z_CLU

మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ ‘RRR’లో హీరోయిన్ ని ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్.. ముందు నుండి వినిపిస్తున్నట్టే కీర్తి సురేష్ ని ఒక హీరోయిన్ గా ఫైనలైజ్ చేసుకున్నారని తెలుస్తోంది. రాజమౌళి ఇప్పటికే కీర్తి క్యారెక్టర్ కి సంబంధించి లుక్ ని కూడా ఫైనల్ చేసారని టాక్. అయితే తారక్ , చరణ్ ఇద్దరిలో కీర్తి ఎవరికి జోడి అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే మిగిలింది.

ప్రస్తుతం మరో హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసుకొనే పనిలో ఉన్న మేకర్స్ ఇద్దరి పేర్లను ఒకేసారి అనౌన్స్ చేయాలని చూస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపటి నుండి రెండో షెడ్యూల్ జరుపుకోనుంది.  డి.వి.వి. ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.